శుక్రవారం, 28 జూన్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (12:47 IST)

ధోని నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న నితిన్

Nithin
Nithin
నటుడు నితిన్ భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని నుండి ప్రత్యేక బహుమతిని అందుకున్నాడు. నితిన్‌కు దిగ్గజ క్రికెటర్ ధోనీ సంతకం చేసిన టీ-షర్ట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆటోగ్రాఫ్‌తో పాటు ధోనీ నటుడికి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇదే విషయాన్ని నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
 
"ఒక అసాధారణ వ్యక్తి నుండి అసాధారణ బహుమతి. దీనికి ధన్యవాదాలు MS ధోనీ సార్" అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, నితిన్ ధోనిని ఎప్పుడు, ఎలా కలిశాడు అని తెలుసుకోవాలని నెటిజన్లు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
నితిన్ తదుపరి చిత్రం వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో కనిపించనున్నాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ తర్వాత, నితిన్ భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో ఒక ప్రాజెక్ట్‌ చేయనున్నాడు. ఇందులోనూ శ్రీలీలనే హీరోయిన్.