బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (10:48 IST)

ఎవరితో సంతోషంగా ఉంటారో వారినే పెళ్లి చేసుకోండి.. కెప్టెన్ ధోనీ

Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లవ్ గురు అవతారమెత్తాడు. పెళ్లి కానీ బ్యాచిలర్స్‌కు కీలక సలహా ఇచ్చాడు. ఎవరితో సంతోషంగా ఉంటారో వారినే పెళ్లి చేసుకోండని ధోనీ తెలిపాడు. తన  గర్ల్ ఫ్రెండ్ మిగిలిన వారి కంటే భిన్నమని మాత్రం అనుకోవద్దంటూ ధోనీ చెప్పాడు. 
 
పెళ్లి వల్ల జీవితంలో ఎంత స్థిరత్వం వచ్చిందని ధోనీని ప్రశ్నించగా.. అనుభవంతో కూడిన సమాధానమిచ్చాడు. 'మీలో ఎంత మందికి పెళ్లైంది. ఇలా అడిగితే చాలా మంది నవ్వుతారు. కానీ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అది పక్కనపెడితే ఎంతమందికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. 
 
భవిష్యత్తులో పెళ్లి చేసుకుందామనుకునేవారు ఎంత మంది ఉన్నారు? మీరు ఆ బంధాన్ని ఎలా చూస్తున్నారన్న అంశంపైనే అది ఆధారపడి ఉంటుంది. మీ జీవితానికి కావాల్సిన మసాలా పెళ్లి నుంచే వస్తుంది. భాగస్వామి రాకతో మీ జీవితం క్రమం తప్పకుండా నడుస్తుందని చెప్పుకొచ్చాడు. 
 
మన బలానికి మూలస్తంభం మాత్రం మన జీవిత భాగస్వామినేనని పెళ్లి గొప్పతనాన్ని ధోనీ వివరించాడు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.