ధోనీ హెయిర్ స్టైల్ అదుర్స్.. కొత్త లుక్ భలే భలే..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హెయిర్ స్టైలిస్ట్ మహీ కొత్త లుక్‌ను నెట్టింట షేర్ చేశాడు. ధోనీ కొత్త స్టైల్‌లో హెయిర్ కట్ చేశాడు. ఆయన కొత్త లుక్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధోనీ స్టైలిస్ట్ అలీం హకీం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ధోనీ బ్రోకు ఈ హెయిర్ స్టైల్ చేసి ఎంతో ఎంజాయ్ చేశానని అలీం తెలిపాడు. ధోనీ ఓ యాడ్‌లో నటించేందుకు ఈ హెయిర్ స్టైల్ చేసుకున్నారని అలీం తెలిపాడు.
అలీమ్ కస్టమర్లలో షాహిద్ కపూర్, సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, అర్జున్ కపూర్, అజయ్ దేవగన్, సంజయ్ దత్, కత్రీనా కైఫ్ వంటి ప్రముఖులు ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, కే.ఎల్.రాహుల్, సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా, హార్ధిక్ పాండ్యా వంటి క్రికెట్ ఆటగాళ్లకు కూడా అలీమ్ స్టైలిస్ట్ కొనసాగుతున్నారు.