గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (23:31 IST)

ధోనీ? విరాట్ కోహ్లీ? ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ ప్లేయర్ ఎవరో తెలుసా?

virat kohli
భారత క్రికెటర్లు తమ సోషల్ మీడియా ఖాతాల నుండి బాగా డబ్బు సంపాదించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఉదాహరణకు, క్రికెటర్లు ఇప్పుడు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక్కో పోస్ట్‌కు భారీ మొత్తాన్ని సంపాదిస్తున్నారు. 
 
తాజా నివేదిక ప్రకారం ఇన్ స్టాలో బాగా ఇన్ కమ్ సంపాదించే క్రికెటర్లలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక్కో ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి రూ.11.45 కోట్లు సంపాదిస్తున్నాడు. తదుపరి స్థానం కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీదే.
 
ధోనీ భారతీయ కరెన్సీలో ఒక్కో పోస్టుకు రూ. 1.44 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇందులో విశేషం ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా లేనప్పటికీ అంత డబ్బు సంపాదిస్తున్నాడు. వీరి తర్వాత రోహిత్ శర్మ 76 లక్షలు, రైనా 34 లక్షలు, హార్దిక్ పాండ్యా 65 లక్షలు ఉన్నారు. 
Dhoni
Dhoni
 
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఆర్జించే వ్యక్తి క్రిస్టియానో ​​రొనాల్డో. అతను భారతీయ కరెన్సీలో ఒక పోస్టుకు రూ. 26.75 కోట్లు అందుకుంటున్నాడు. మరో ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ రికార్డు స్థాయిలో రూ. 21 కోట్ల 49 లక్షలు పొందుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 20 జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడిగా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు.