బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (23:01 IST)

ఆసియా ఛాంపియన్స్ కప్ హాకీ: జపాన్‌పై గెలుపు-ఫైనల్లోకి భారత్

indian hockey team
తమిళనాడు రాజధాని నగరం చెన్నైలోని ఎగ్మోర్‌లోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో 7వ ఆసియా ఛాంపియన్స్ కప్ హాకీ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ సందర్భంలో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమైన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత జట్టు ఢీకొంది.

ఆట తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గోల్ చేయలేదు. రెండో అర్ధభాగంలో భారత ఆటగాళ్లు 5 గోల్స్ సాధించారు. చివరికి భారత్ 5-0తో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో మలేషియాతో భారత్ తలపడనుంది.