గురువారం, 18 జులై 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (09:48 IST)

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌- నీరజ్ చోప్రా కెప్టెన్సీ

neeraj chopra
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆడే పురుషుల భారత అథ్లెటిక్స్ జట్టుకు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా కెప్టెన్సీ సారథ్యం చేపట్టనున్నారు. స్టీపుల్‌ఛేజర్ అవినాష్ సేబుల్, లాంగ్ జంపర్లు జెస్విన్ ఆల్డ్రిన్, మురళీ శ్రీశంకర్, జ్యోతి యర్రాజీ (మహిళల 100 మీటర్ల హర్డిల్స్) వంటి స్టార్‌లతో సహా బలమైన బృందానికి నీరజ్ చోప్రా నాయకత్వం వహిస్తారు.
 
ఆగస్టు 19 వరకు బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం కోసం భారత అథ్లెట్లు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే.. నీరజ్ చోప్రా జ్యూరిచ్‌లో జరిగిన గోల్డెన్ లీగ్ ఫైనల్‌లో గెలిచి అంతర్జాతీయ వేదికపై అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది మేలో దోహా డైమండ్ లీగ్‌లో 88.67 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించాడు. 
 
బుడాపెస్ట్‌లో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ల తుది ప్రవేశ జాబితాలను ట్రాక్ అండ్ ఫీల్డ్ ప్రపంచ గవర్నింగ్ బాడీ వరల్డ్ అథ్లెటిక్స్ గురువారం విడుదల చేసింది. 202 జట్ల నుండి 2100 కంటే ఎక్కువ మంది అథ్లెట్లు ఆగస్ట్ 19-27 తేదీల మధ్య హంగేరియన్ రాజధానిలో జరిగే పోటీల్లో రాణించాలని భారత అథ్లెట్లు సమరానికి సై అంటున్నారు.