శామ్‌సంగ్ జెడ్ ఫ్లిఫ్ 5, జెడ్ ఫోల్డ్ 5 ఫోన్స్.. ప్రీ -బుకింగ్‌లో రికార్డ్..
Galaxy Z Flip 5, Z Fold 5
శామ్‌సంగ్ గ్యాలెక్సీ జెడ్ ఫ్లిఫ్ 5, జెడ్ ఫోల్డ్ 5 ఫోన్లు ప్రీ -బుకింగ్‌లో రికార్డ్ సృష్టించాయి. భారతదేశంలో బుకింగ్‌లు ప్రారంభించిన మొదటి 28 గంటల్లోనే Samsung 5 అల్ట్రా-ప్రీమియం ఫోల్డబుల్ పరికరాలైన Galaxy Z Flip 5, Z Fold 5 1 లక్ష యూనిట్ల ప్రీ-బుకింగ్‌లను పొందిందని కంపెనీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
4జీ ఫోల్డబుల్స్ (గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫోల్డ్ 4)తో పోలిస్తే, శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ,ఫ్లిప్ 5, జెడ్ ఫోల్డ్ 5 ప్రీ-బుకింగ్ ప్రారంభమైన తొలి 28 గంటల్లో 1.7 రెట్లు ఎక్కువ ప్రీ-బుకింగ్‌లను పొందిందని సామ్‌సంగ్ వెల్లడించింది.
ఈ ఫోన్లకు ప్రీ-బుకింగ్స్ జూలై 27, 2023న ప్రారంభించబడ్డాయి. "మేడ్ ఇన్ ఇండియా" పరికరాలను ఆగస్టు 18 నుండి విక్రయించడానికి షెడ్యూల్ చేయబడింది. భారతదేశంలో మా కొత్తగా లాంచ్ చేయబడిన Galaxy Z Flip 5, Galaxy Z Fold 5 ఫోన్‌లకు అద్భుతమైన స్పందన వచ్చిందని శామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా, ప్రెసిడెంట్, సిఇఒ జెబి పార్క్ అన్నారు.
ఇకపోతే.. Galaxy Fold 5 ధర రూ. 1,54,000 లక్షలు. 256GB నుండి 1TB వరకు ఉండే అంతర్గత నిల్వ సామర్థ్యాన్ని కలిగివుండే ఫోన్ 1,85,000 లక్షలు. Samsung Galaxy Flip 5 ధర రూ. 99,999ల నుంచి ప్రారంభం అవుతుంది.