మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (16:46 IST)

ఫేస్‌బుక్‌పై దావా వేశాడు.. రూ.41 లక్షల పరిహారం చెల్లించాలన్న కోర్టు

Facebook
ఎలాంటి కారణం లేకుండా ఫేస్‌బుక్ ఖాతాను డిసేబుల్ చేశారంటూ ఫేస్‌బుక్‌పై దావా వేసిన వ్యక్తికి రూ.41 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఫేస్‌బుక్ ఒకటి. 
 
ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నప్పుడు పోస్ట్ చేయడంపై ఫేస్‌బుక్‌కి అనేక పరిమితులు ఉన్నాయి. ఫేస్‌బుక్ యూజర్లు నిబంధనలను ఉల్లంఘిస్తే వారి ఖాతాను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తొలగించవచ్చు. 
 
అయితే సరైన కారణం లేకుండానే ఫేస్‌బుక్ యూజర్ అకౌంట్‌ను డిసేబుల్ చేస్తుందని అనేక ఆరోపణలు ఉన్నాయి. అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన జాసన్ క్రాఫోర్డ్ ఫేస్‌బుక్ ఖాతాను గత ఏడాది ఫేస్‌బుక్ డిసేబుల్ చేసింది.
 
ఎందుకు అని ప్రశ్నించగా.. చైల్డ్ పోర్నోగ్రఫీని పోస్ట్ చేశాడని ఫేస్ బుక్ వివరించింది. తాను అలాంటి రికార్డులేమీ చేయలేదని, అయితే ఫేస్‌బుక్ మాత్రం స్పందించలేదన్నారు.