ర్యాపిడో - ఉబర్ సంస్థలకు షాకిచ్చిన సుప్రీంకోర్టు
దేశ వ్యాప్తంగా ట్యాక్సీ సేవలు అందిస్తున్న ర్యాపిడో, ఉబర్ సంస్థలకు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. గతంలో ఈ సంస్థలు అందించే టూవీలర్ సేవలను నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీటిని సవాల్ చేస్తూ ఆ సంస్థలు ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళగా, ఈ సర్వీసులను అనుమతిస్తూ అనుమతి ఇచ్చింది.
వీటిని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ర్యాపిడో, ఉబర్‌లు మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ఉల్లంఘిస్తున్నాయంటూ ఢిల్లీ ప్రభుత్వం గత ఫిబ్రవరి నెలలో బైక్, ట్యాక్సీ సేవలను ఢిల్లీ సర్కారు నిషేధించింది. ద్విచక్ర వాహనేతరుల రవాణాపై పరిపాలన ద్వారా తుది నిర్ణయాన్ని ప్రకటించే వరకు బైక్, ట్యాక్సీ అగ్రిగేటర్లు, ర్యాపిడో, ఉబర్‌లు తమ సేవలను నిలిపివేయాలని తెలిపింది.