మోదీ విద్యార్హత.. గుజరాత్ హైకోర్టు తీర్పును సమీక్షించాలి.. కేజ్రీవాల్  
                                       
                  
                  				  ప్రధాన మంత్రి మోదీ విద్యార్హతలు తెలియజేయాలంటూ 2016లో అరవింద్ కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం కమిషనర్‌కు ఒక లేఖ రాశారు. దీనిపై స్పందించిన కమిషనర్ రాజనీతి శాస్త్రంలో మోదీ మాస్టర్స్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారని చెప్పారు. 
				  											
																													
									  
	 
	అయితే ఇదే అంశంపై కేజ్రీవాల్ ఢిల్లీ యూనివర్సిటీకి ఒక లేఖ రాశారు. ప్రధాని సర్టిఫికెట్‌ను యూనివర్సిటీ వెబ్ సైట్‌లో ప్రచురించాలని కోరారు. 
				  
	 
	ఈ విషయం కోర్టుకి వెళ్లడంతో గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను గుజరాత్ హైకోర్టు పక్కన పెట్టేసింది. మోదీకి సంబంధించిన సర్టిఫికేట్లను సీఎంఓ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఈ నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు తీర్పును మరోసారి సమీక్షించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. దీనిని స్వీకరించిన గుజరాత్ హైకోర్టు జస్టిస్ బీరన్ వైష్ణవ్ విచారణ అనంతరం కేసును జూన్ 30కి పడింది