సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 మార్చి 2023 (12:20 IST)

టీఎస్ ఐసెట్-మే 26,27 తేదీల్లో పరీక్షలు.. జూన్ 20న ఫలితాలు

Online Exams
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ అకాడమీ ఇయర్ ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. అపరాధ రుసుము లేకుండా మార్చి 6 నుంచి మే 6వ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఫీజు వివరాలు కేటగిరీల ప్రకారం వెబ్ సైట్‌ను సందర్శించి.. చెల్లించవచ్చు.
 
హాల్‌టికెట్లను మే 22 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. టీఎస్‌ ఐసెట్‌ ప్రవేశపరీక్షను మే 26,27 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. 
 
ప్రాథమిక కీని జూన్‌ 5న విడుదల అవుతుంది. ప్రాథమిక కీపైన అభ్యంతరాలు ఉంటే జూన్‌ 8వ తేదీ వరకు తెలియజేయాల్సింటుంది. ఫలితాలు జూన్‌ 20న విడుదల చేస్తారు.