1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (19:25 IST)

దేశ రాజధానిలో 433 శాతం పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతుంది. రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా పాజిటివ్ కేసుల పెరుగుదల శాతం ఏకంగా 433 శాతానికి పెరిగింది. మార్చి 30వ తేదీన నాటికి ఢిల్లీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 932గా ఉండగా, ఏప్రిల్ నాటికి ఈ కేసుల సంఖ్య 4,976కు చేరుకుంది. అంటే గత 18 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 433 శాతానికి పెరిగింది. అయితే, ఆస్పత్రుల్లో చేరే కరోనా బాధితుల సంఖ్య పెరగడం లేదు. దీంతో ఢిల్లీ పాలకులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అందువల్ల ఆందోళన చెందాల్సిన పనిలేదని వారు వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
అదేసమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ, టీకా బూస్టర్ డోసులను తీసుకుంటే కరోనా దరిచేరకుండా నిరోధించవచ్చని చెబుతున్నారు. కాగా, ఢిల్లీలో ఏప్రిల్ 12వ తేదీ నాటికి కరోనా రోజువారీ కేసుల సంఖ్య వెయ్యి మార్కుకు దాటింది. అప్పటి నుంచి రోజుకు వెయ్యి చొప్పున పెరుగుతూ ప్రస్తుతం ఐదు వేలకు చేరువయ్యాయి. 
 
దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే, ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతుందని నిపుణనులు హెచ్చరిస్తున్నారు. అయితే, కోరనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో ముందుకు రావడం కూడా కొత్త కేసుల్లో భారీ పెరుగుదలకు ఓ కారణం అయివుంటుందని వైద్య ఆరోగ్యలు చెబుతున్నారు.