సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-04-2023 తేదీ సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన...

Sagitarus
మేషం :- రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు కార్మికుల వల్ల ఇబ్బందులు తప్పవు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థులకు శుభవార్తా శ్రవణం. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు.
 
వృషభం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పాత బిల్లులు చెల్లిస్తారు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి రాగలవు. స్త్రీలు పనివారలతో సమస్యలుఎదుర్కుంటారు. 
 
మిథునం :- కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత, మెళుకువ చాలా వహించండి. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహపరుస్తాయి. మితిమీరిన ఆలోచనలు, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అనారోగ్యానికి గురవుతారు.
 
కర్కాటకం :- స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాల్లో లౌక్యం అవసరం. ఏ విషయంలోను వాదించకుండా రాజీమార్గం అనుసరించండి. ఉద్యోగస్తులకు, మార్కెట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. కీలకమైన వ్యవహరాల్లో జయం, మొండి బాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి.
 
సింహం :- మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల పనివారికి చికాకులు అధికమవుతాయి. మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు.
 
కన్య :- మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీలకు అయిన వారితో పట్టింపులెదురవుతాయి. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచనస్ఫురిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, కోరుకున్నచోటికి బదిలీ వంటి శుభ పరిణామాలున్నాయి.
 
తుల :- ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాలు, సంస్థలలో కొత్త భాగస్వాములను చేర్చుకునే విషయంలో పునరాలోచించండి. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
వృశ్చికం :- బ్యాంకు వ్యవహరాలు, ప్రయాణాల్లో ఏకాగ్రత వహించండి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. రాజీమార్గంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబీకుల నడుమ అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
ధనస్సు :- ఆర్థిక వ్యవహరాలు, కుటుంబ విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఒకానొక విషయంలో బంధువులతీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా మెలగండి. స్త్రీలు పట్టుదలతో శ్రమించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
 
మకరం :- బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి పనివారలతో చికాకులు తప్పవు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం ఉత్తమం. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. ప్రత్యర్థులను సైతం మీ వైపునకు తిప్పుకుంటారు.
 
కుంభం :- రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు ఏమంత సంతృప్తినీయవు. సన్నిహితులతో ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. గృహ వాస్తు దోష నివారణ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారికి పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది.
 
మీనం :- ఉద్యోగ యత్నంలో దళారులను విశ్వసించకండి. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రేమికుల విపరీత ధోరణి వల్ల సమస్యలెదురవుతాయి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. రుణాలు తీరుస్తారు.