1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (23:00 IST)

ఈక్వెడార్‌లో అధ్యక్ష అభ్యర్థి హత్య... 60 రోజుల పాటు అత్యవసర పరిస్థితి

Ecuador
Ecuador
దక్షిణ అమెరికా దేశాలలో ఈక్వెడార్ ఒకటి. ఈ దేశంలో ఆగస్టు 20న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ప్రముఖ పార్టీల నుంచి 8 మంది పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరు ఫెర్నాండో విల్లిసెన్సియో. జర్నలిస్టుగా దేశంలో అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పారు.
 
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్నారు. రాజధాని క్విటోలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రచారం ముగించుకుని ఫెర్నాండో తన కారులో వస్తుండగా, ఓ దుండగుడు ఫెర్నాండోపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రగాయాలతో రక్తమోడుతూ అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
ఈ ఘటన అక్కడ సంచలనం కాగా.. క్విటోలోని ఓ ఇంట్లో ఆయుధాలతో దాక్కున్న ఆరుగురు విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫెర్నాండో హత్య తర్వాత 60 రోజుల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.