శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (10:02 IST)

ఇటలీలో పడవ బోల్తా- 41 మంది శరణార్థుల మృతి

Boat Capsizes
అంతర్యుద్ధం, పేదరికంతో బాధపడుతున్న ఆఫ్రికన్ దేశాల ప్రజలు జీవనోపాధి కోసం వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. వీరిలో చాలా మంది మధ్యధరా మార్గంలో అక్రమంగా పడవలు నడిపి యూరప్ చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. 
 
ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు తరచుగా విషాదంలో ముగుస్తాయి. ఎక్కువ మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవలు బోల్తా పడి చాలా మంది చనిపోయారు. తాజాగా, ఇటలీలోని లాంపెడుసా ద్వీపం సమీపంలో 45 మందితో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోవడంతో 41 మంది మరణించారు. 
 
ట్యునీషియాలోని స్పాక్స్‌ నుంచి ఇటలీ వైపు వెళుతున్న పడవ ఒక్కసారిగా కూలిపోయి మునిగిపోయిందని ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు వ్యక్తులు తెలిపారు.