సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 11 ఆగస్టు 2023 (22:57 IST)

ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం MR ఆధారిత HDR ఇంటర్‌స్టీషియల్ బ్రాచిథెరపీపై వర్క్‌షాప్ నిర్వహించిన అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్

Doctors
దక్షిణాసియాలోని అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ చైన్‌లలో ఒకటైన అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) హైదరాబాద్‌లోని AOIలో MR ఆధారిత HDR ఇంటర్‌స్టీషియల్ బ్రాచిథెరపీపై వర్క్‌షాప్‌ను నిర్వహించింది. రేడియేషన్ ఆంకాలజిస్ట్‌లు మరియు మెడికల్ ఫిజిస్ట్‌లు ఇద్దరికీ సంపూర్ణ అభ్యాసాన్ని నిర్ధారించడానికి నిపుణులైన అంతర్జాతీయ అకడమిక్ ఫ్యాకల్టీచే ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించబడింది.
 
MR ఆధారిత HDR ఇంటర్‌స్టీషియల్ బ్రాచిథెరపీ అనేది MR ఇమేజింగ్ యొక్క ప్రయోజనాలను అధిక మోతాదు రేటు బ్రాచీథెరపీతో మిళితం చేసే ఒక అధునాతన వైద్య సాంకేతికత. అమెరికన్ సొసైటీ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ ఫెలో మరియు అమెరికన్ బ్రాచిథెరపీ సొసైటీకి చెందిన డాక్టర్ సుశీల్ బెరివాల్‌తో పాటుగా డాక్టర్ హర్జోత్ కౌర్ బజ్వా, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ & బ్రాచిథెరపీ స్పెషలిస్ట్, AOI, లు Ca ప్రోస్టేట్‌లో MR ఆధారిత HDR ఇంటర్‌స్టీషియల్ బ్రాచీథెరపీపై లైవ్ కేస్ డెమో నిర్వహించారు.
 
ఈ వర్క్‌షాప్‌పై డాక్టర్ సుశీల్ బెరివాల్ మాట్లాడుతూ, “కేన్సర్ కణాలను చంపడానికి రేడియేషన్ థెరపీ ఒక మార్గం. రేడియేషన్ బయట నుండి లేదా శరీరం లోపల నుండి ఇవ్వవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స కోసం ఇంటర్‌స్టీషియల్ బ్రాచిథెరపీలో, రేడియేషన్ సరిగ్గా ప్రోస్టేట్ గ్రంధిలోకి ప్రవేశపెడతారు. ఈ రకమైన చికిత్స యొక్క ప్రయోజనం ఏమిటంటే రేడియేషన్ ఒక చిన్న ప్రాంతానికి పరిమితం చేయబడింది. ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేయదు..." అని అన్నారు. 
 
ఈ సందర్భంగా, AOI, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ & బ్రాచిథెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ హర్జోత్ కౌర్ బజ్వా మాట్లాడుతూ, “కార్సినోమా ప్రోస్టేట్ కోసం MR బేస్డ్ HDR ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని హైదరాబాద్‌లోని AOIలో రెండు రాష్ట్రాల్లో మొదటిసారిగా నిర్వహించడం జరిగింది. బాహ్య రేడియోథెరపీతో పోలిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ రోగులలో ఫలితాలను గణనీయంగా ఈ విధానం మెరుగుపరుస్తుంది. ఈ సాంకేతికతతో, ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు సమగ్ర క్యాన్సర్ సంరక్షణను అందించగలము" అని అన్నారు.
 
 రీజనల్  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, AOI  డాక్టర్ ప్రభాకర్ P మాట్లాడుతూ, “MR ఆధారిత HDR ఇంటర్‌స్టీషియల్ బ్రాచిథెరపీ వర్క్‌షాప్ యొక్క అద్భుతమైన విజయం, భాగస్వామ్య ఆవిష్కరణను పెంపొందించడంలో మా దృఢ నిబద్ధతకు నిదర్శనం. ఈ శిక్షణతో మేము మా రేడియేషన్ ఆంకాలజిస్ట్‌లు, మెడికల్ ఫిజిస్ట్‌లకు సరికొత్త పరిజ్ఞానం అందించటం లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అన్నారు.