1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2023 (22:26 IST)

కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న హీరో నితిన్ మామ?

nithin
తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి మొదలైంది. రెండో జాబితాలో పేర్లు లేకపోవడంతో కొందరు నేతలు తమ అనుచరులతో పార్టీ మార్పుపై చర్చిస్తున్నారు. ఫిరాయింపు దారులకు టిక్కెట్లు ఇచ్చారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 
 
జడ్చర్ల, నారాయణపేట టికెట్‌ ఆశించిన ఎర్ర శేఖర్‌కు టికెట్‌ దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. శనివారం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో హీరో నితిన్ మామ నగేష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. 
 
నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన నగేష్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన మామ టికెట్ కోసం నితిన్ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ అధిష్టానం భూపతి రెడ్డికి టికెట్ కేటాయించినట్లు సమాచారం.