1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2023 (16:06 IST)

కోలీవుడ్‌లో విషాదం ... ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మిలన్ మృతి

milan art director
కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మిలన్ (54) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. తమిళ అగ్రహీరో అజిత్ నటిస్తున్న కొత్త చిత్రం "విడాముయర్చి" చిత్ర షూటింగ్ కోసం ఆయన అజర్‌బైజాన్‌కు వెళ్లారు. అక్కడ ఆదివారం వేకువజామున గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. మిలన్ మృతిపట్ల చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలుపుతున్నారు. 
 
కాగా, గత 2006లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన.. ఆ తర్వాత అజిత్ నటించిన 'వేలాయుధం', 'వీరమ్', 'రజినీకాంత్' నటించిన అన్నాత్త వంటి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టరుగా పని చేశారు. ఇపుడు అజిత్ హీరోగా తెరకెక్కుతున్న 'విడాముయర్చి' చిత్రానికి కళా దర్శకుడిగా పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు.