ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (16:24 IST)

స్కూల్ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 40మంది విద్యార్థులు ఏమయ్యారు?

heart stroke
బస్సును నడుపుతున్న స్కూల్ బస్సు డ్రైవర్‌కు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. అయితే డ్రైవర్‌ పెను ప్రమాదాన్ని తప్పించేందుకు.. బస్సును ఆపేశాడు. దీంతో 40మంది పాఠశాల విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఏపీలోని బాపట్ల జిల్లా, మైలవరం, ఉప్పలపాడు, వెంపర గ్రామాల మీదుగా స్కూల్ బస్సును డ్రైవర్ ఏడుకొండలు (53) నడుపుతున్నాడు. ఉన్నట్టుండి డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. కానీ, అతను అపస్మారక స్థితికి చేరుకోకముందే, సెకను వ్యవధిలో, అతను వాహనాన్ని ఆపి పెను ప్రమాదం తప్పించాడు. 
 
స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యార్థులను అదే బస్సులో మరో డ్రైవర్ పాఠశాలకు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.