మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (09:24 IST)

అలిపిరి మార్గంలో చిక్కిన మరో చిరుత.. ఆరుకు చేరిన చిరుతల సంఖ్య

cheetah captured
అలిపిరి - తిరుమల నడక మార్గంలో మరో చిరుత పులి చిక్కింది. ఈ మార్గంలో తితిదే అటవీశాఖ అధికారులు పెట్టిన బోనులో ఈ చిరుత చిక్కింది. దీంతో ఇప్పటివరకు చిక్కిన చిరుత పులుల సంఖ్య ఆరుకు చేరింది. గతంలో మెట్ల మార్గంలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారిపై దాడి చేసి చంపేసిన ప్రాంతంలోనే ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుత చిక్కింది. 
 
దీంతో ఈ చిరుత పులే చిన్నారి లక్షితపై దాడి చేసి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ చిరుతను జూ పార్కుకు తరలించనున్నారు. కాగా, ఈ మార్గంలో మరికొన్ని చిరుతలు ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో మెట్ల మార్గంలో మరికొన్ని బోన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, మెట్ల మార్గంలో శ్రీవారి భక్తుల రాకపోకలపై ఆంక్షలు కొనసాగనున్నాయ.