1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (11:01 IST)

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా

jagan
ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయనకు అందించిన చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అపెండిసైటిస్‌తో బాధపడుతున్న అబ్దుల్ నజీర్‌కు సర్జరీ చేసినట్టు వైద్యులు చెప్పారు. 
 
ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు జగన్‌కు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. 
 
ఇకపోతే.. గవర్నర్ కడుపు నొప్పితో బాధపడుతూ తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో సోమవారం  చేరారు. గవర్నర్ అస్వస్థతకు గురికావడంతో తొలుత రాజ్‌భవన్ వర్గాలు వైద్యులకు సమాచారం అందించాయి. వెంటనే విజయవాడ నుంచి వచ్చిన వైద్యులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను పరీక్షించారు. 
 
వారి సూచన మేరకు ఆయనను మణిపాల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆయనకు అపెండిసైటిస్‌ కారణంగా రోబోటిక్ అసిస్టెడ్ అపెండిసిటోమీ ఆపరేషన్ చేశారు.