మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (10:18 IST)

జగన్‌కు ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా : మాజీ మంత్రి డీఎల్

DL Ravindra reddy
గత ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేసినందుకు తన చెప్పుతో తాను కొట్టుకుంటున్నానని ఏపీ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి స్పందిస్తూ, 'జగన్‌కు ఓటేసిందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కానీ అలా కొట్టుకోలేను. చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం. ఇది పూర్తిగా జగన్ కక్షసాధింపు చర్య' అని అన్నారు. 
 
'చంద్రబాబు మాజీ ముఖ్య మంత్రి అని కూడా చూడకుండా నంద్యాలలో అరెస్టు చేస్తే 150కి.మీ. దూరంలోని విజయవాడ కోర్టులో పెట్టడం దుర దృష్టకరం. చార్జిషీటులో పేరు లేకుండా, సాక్ష్యాధారాలు చూపకుండా అరెస్టు చేశారు. ఇంతటి ఘోరమైన పాలన నా జీవితంలో చూడలేదు. ఏసీబీ కోర్టు జడ్జి చంద్రబాబుకు రిమాండ్ ఇచ్చి ఉండకూడదు. ఆమె కడపలో కూడా పనిచేశారు. ఇలాంటి తీర్పు ఎందుకిచ్చారో అర్థం కావడం లేదు. నాకు తెలిసి జ్యుడీషియరీలో ఇలాంటి తీర్పు ఇదే ప్రథమం. రాబోయేకాలంలో డబ్బుకు కక్కుర్తి పడకుండా మీ జీవితాలు బాగుపడేలా చేసేవారికి ప్రజలు ఓట్లు వేయాలి' అని పిలుపునిచ్చారు.