సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (23:37 IST)

ఆసియా కప్ ఫైనల్స్.. శ్రీలంకకు తీక్షణ- భారత్‌కు అక్షర్ పటేల్ దూరం

Sri Lanka
Sri Lanka
ఆసియా కప్ ఫైనల్‌ కోసం భారత్- శ్రీలంక సిద్ధమవుతున్న వేళ.. శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరుగనున్న మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్‌ స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ జట్టుకు దూరమయ్యాడు. 
 
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఆయన కుడి తొడ కండరం పట్టేసింది. తొడ నొప్పి కారణంగా అతను ఫైనల్స్‌కు దూరమయ్యాడు. 
 
అలాగే టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది.