శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (12:09 IST)

ప్రాణాలతో జీవించివున్న ఎల్టీటీఈ ప్రభాకరన్ కుమార్తె..?

ltte
ఒకపుడు శ్రీలంక దేశాన్ని గడగడలాడించిన ఎల్టీటీఈ ప్రభాకరన్ కుమార్తె ప్రాణాలతో జీవించివున్నట్టు ఓ వీడియో విడుదలైంది. ఇది ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళ ఈలం కోరుతూ శ్రీలంకలో జరిపిన అంతర్యుద్ధంలో ఎల్టీటీఈ అధ్యక్షుడు ప్రభాకరన్ 2009లో ఆ దేశ సైన్యం చేతిలో హతమైన విషయం తెల్సిందే. అలాగే, ఈ యుద్ధంలో ప్రభాకరన్ భార్య మదివదని, ఇద్దరు కుమారులు, కుమార్తె ద్వారక తదితరులు మృతి చెందినట్లు శ్రీలంక సైన్యం ప్రకటించింది. 
 
అయితే, ప్రభాకరన్ ప్రాణాలతోనే ఉన్నారని పలువురు వివిధ సందర్భాల్లో ప్రకటించినా వాటిని శ్రీలంక సైన్యం ఖండించింది. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌లో ఉంటున్న తారకా హరిధరన్ అనే మహిళ తాను ప్రభాకరన్ భార్య మదివదని సోదరినని చెబుతూ వీడియో విడుదల చేశారు. అందులో మదివదని, ప్రభాకరన్ కుమార్తె ద్వారక బతికే ఉన్నారని పేర్కొనడం సంచలనంగా మారింది. 
 
మరోవైపు శ్రీలంక సామాజిక మాధ్యమాల్లో సైతం ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ దేశంలో సర్వ మక్కల్ కట్చి అనే సంస్థను నిర్వహిస్తున్న ఉదయకళ అనే మహిళనే ప్రభాకరన్ కుమార్తె ద్వారకా అని అందులో పేర్కొన్నారు. ద్వారకా తన పేరుని ఉదయకళగా మార్చుకుని తమిళనాడులో ఆశ్రయం పొంది ప్రస్తుతం శ్రీలంకలో ప్రజాసేవ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వీడియోలో వెల్లడించారు.