గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (14:33 IST)

నటి రోజా కుమార్తె అందం అదరహో.. హీరోయిన్లకే టఫ్ ఇస్తుందా? (photos)

roja daughter
సీనియర్ నటి, వైసీపీ నేత రోజా కుమార్తె అన్షు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 1992లో నటుడు ప్రశాంత్‌ నటించిన సెంబరుతి చిత్రంలో హీరోయిన్‌గా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే జనాల్లో ఆదరణ పొందిన రోజా తర్వాత చాలా సినిమాలు చేసింది. 
Anshu
Anshu



రజినీ, కమల్, శరత్‌కుమార్, ప్రభు, విజయకాంత్‌తో సహా తమిళ సినిమా ప్రముఖ నటులతో ఆమె నటించింది. తమిళంలో వరుస సినిమాల్లో నటించిన రోజా తెలుగు, కన్నడ, మలయాళం తదితర భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. 
Anshu
Anshu
తన అందాలతో సౌత్ ఇండియా మొత్తాన్ని ఫిదా చేసిన రోజా 2002లో తమిళ సినీ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

పెళ్లి తర్వాత సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపని రోజా.. రాజకీయాలపై దృష్టి సారించింది. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరిన రోజా ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 
Anshu
Anshu
 
ప్రస్తుతం రాజకీయ జీవితంలో యాక్టివ్‌గా ఉన్న రోజా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలో నటి రోజా కూతురు అన్షు మాలిక ఫోటో ఒకటి విడుదలై అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 
Anshu
Anshu


నటి రోజాకు కుమార్తె ఇంత అందంగా వుందని నోరెళ్లబెడుతున్నారు. ఈమె హీరోయిన్‌గా నటిస్తే అగ్ర హీరోయిన్లకే టఫ్ ఇస్తుందంటూ సినీ పండితులు అంటున్నారు.