గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (11:20 IST)

కంగనాను కలిస్తే రెండు చెంపదెబ్బలు ఖాయం.. పాక్ నటి

kangana
బాలీవుడ్ నటి కంగనాను కలిస్తే రెండు సార్లు చెంపదెబ్బ కొడతానని పాకిస్థాన్ నటి నౌషీన్ షా అన్నారు. పాకిస్థాన్ నటి నౌషీన్ షా పోస్ట్ చేసిన వీడియోలో, 'నేను బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ఒక్కసారైనా కలవాలనుకుంటున్నాను. అలా కలిస్తే రెండు సార్లు చెంపదెబ్బ కొడతాను. 
 
పాకిస్థాన్ గురించి చెడుగా మాట్లాడుతోంది. పాకిస్థాన్ ఆర్మీపై చాలా హాస్యాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమెకు జ్ఞానం లేదు. అసలు కంగనా ఇతర దేశం గురించి అలా ఎందుకు కించపరుస్తూ మాట్లాడుతోంది?. మీ దేశంపై దృష్టి పెట్టండి. మీ సినిమాలు చూడండి. మీ వివాదాల గురించి మాట్లాడండి మాజీ ప్రియుల గురించి మాట్లాడండి" అంటూ నౌషీన్ దూకుడుగా పోస్ట్ చేసింది. 
 
పాకిస్థాన్ నటి నౌషీన్ షాకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంగనా అభిమానులు, ఆమె ప్రత్యర్థులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఇతర దేశాలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.