45మంది టీచర్లపై ప్రిన్సిపాల్ అకృత్యాలు.. పాకిస్థాన్‌లో అరెస్ట్
పాకిస్థాన్ కరాచీలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ మహిళా టీచర్లపై అకృత్యాలకు పాల్పడ్డాడు. టీచర్లను బెదిరించి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఆరోపణలపై ప్రిన్సిపాల్ అరెస్ట్ అయ్యాడు.
ఈ ప్రిన్సిపాల్ ఒకరు కాదు ఇద్దరు కాదు 45మందికి పైగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. అలాగే సీసీటీవీ ఫుటేజీలను చూపించి మహిళా టీచర్లను ప్రిన్సిపాల్ బెదిరించే వాడని తెలిసింది.
ఈ మేరకు ఇర్ఫాన్ గఫూర్ మెమన్ అనే ఈ ప్రిన్సిపాల్ ఫోన్ నుంచి 25 షార్ట్ వీడియో క్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఓ మహిళా టీచర్‌తో గఫూర్ ఏకాంతంగా ఉన్న ఒక వీడియో బయటకు రావడంతో ప్రిన్సిపాల్ గఫూర్‌కు స్థానిక కోర్టు ఏడు రోజులు రిమాండ్ విధించింది. ఉద్యోగం ఆశ చూపించి మహిళా టీచర్లపై గఫూర్ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పోలీసులు వెల్లడించారు.