సోమవారం, 4 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (23:44 IST)

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ.. మహిళా రిజర్వేషన్ బిల్లుతో..?

kcrao
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. 33 శాతం బీసీ రిజర్వేషన్‌ బిల్లుతో సహా 33 శాతం మహిళా
రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ రెండు బిల్లులను సభ ముందుకు తీసుకురావాలన్నారు. 
 
శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో ఈ అంశంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. 
 
ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీసీ (ఓబీసీ) బిల్లు, మహిళా బిల్లు ఈ రెండు బిల్లుల ప్రవేశానికి బీఆర్‌ఎస్ ఎంపీలు చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంటరీ పార్టీ సుదీర్ఘంగా చర్చించింది.
 
మహిళల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ కట్టుబడి ఉందని, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ కట్టుబడి ఉందని, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ హక్కులను ఎప్పటికప్పుడు కేంద్రానికి వినిపిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 
 
ఈ దిశగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యసభ, లోక్‌సభలో ఎంపీలు పార్టీ డిమాండ్లను లేవనెత్తాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు.