గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (10:11 IST)

దసరా కానుకగా తెలంగాణలో "ముఖ్యమంత్రి అల్పాహారం"

kcrao
దసరా కానుకగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించిన "ముఖ్యమంత్రి అల్పాహారం" పథకం ద్వారా తెలంగాణలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 24 నుండి పౌష్టికాహార అల్పాహారం అందించబడుతుంది. 
 
ఈ కార్యక్రమానికి సుమారు రూ. ఏటా 400 కోట్లతో, విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రారంభించబడింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ పథకం అమలులోకి రానుంది. తమిళనాట ఇప్పటికే ఈ పథకం అమలులో వుంది. ఇదే తరహాలో తెలంగాణలోనూ పాఠశాల విద్యార్థులకు అల్పాహారాన్ని అందించడం ద్వారా వారిలో ఏకాగ్రత పెరుగుతుందని టి సర్కారు భావిస్తోంది.
 
ఉదయాన్నే వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన తల్లిదండ్రులు పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.