1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (15:10 IST)

కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు.. స్కూళ్లలో ఫోన్లు నిషేధం

mobile customer
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో ఫోన్లు నిషేధించింది. విద్యార్థులు పాఠశాలలకు మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, ఉపాధ్యాయులు కూడా తాము వినియోగించే మొబైల్ ఫోన్లను తరగతి గదుల్లోకి తీసుకెళ్ళకూడదని స్పష్టంచేసింది. నిబంధనలు ఉల్లఘించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 
 
తరగతి గదుల్లో బోధనకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నిబంధనలు ఉల్లఘించే ఉపాధ్యాయులు, విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. పైగా, ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూచన చేసింది.