ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (20:43 IST)

మైనర్ బాలికలపై కన్నేసిన డ్రైవర్.. తెల్లారితే రెస్టార్ట్‌కు సాయంత్రం ఇంటికి..?

minor girl
కేరళలోని కోజికోడ్‌కు చెందిన ముర్షిద్ మహ్మద్ (వయస్సు 24). ప్రైవేట్ బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తున్న అతనిపై మలప్పురానికి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సులో వెళ్తున్న తమ కుమార్తెతో ముర్షిద్‌ మహ్మద్‌ స్నేహం చేసి, మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
అనంతరం విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ముర్షిద్ మహ్మద్ డ్రైవర్‌గా పనిచేస్తున్న బస్సులో విద్యార్థిని ప్రయాణిస్తోంది. విద్యార్థినితో డ్రైవర్ పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఈ పరిచయంతోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. ఇంకా అతని వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఇలాగే చాలామంది అమ్మాయిలను లొంగదీసుకున్నట్లు తెలిసింది. తన బస్సులో ప్రయాణిస్తున్న మైనర్ బాలికలతో మాట్లాడి రిసార్ట్‌కు ఆహ్వానించి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసింది. బాలికలను ఉదయం రిసార్ట్‌కు తీసుకెళ్లి సాయంత్రం తిరిగి తీసుకు వచ్చేవాడు. ఎంతమంది అమ్మాయిలను ఈ విధంగా బస్సు డ్రైవర్ వేధించాడోనని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.