మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (23:15 IST)

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం

kcrcm
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగు నీటిని అందించే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 
 
నార్లాపూర్‌ పంప్‌ హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యం గల మోటర్లను సీఎం కేసీఆర్ ఆన్‌ చేసి, నీటిని విడుదల చేశారు. అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి, హారతి ఇచ్చారు. 
 
శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా కృష్ణా నది నుంచి నీటిని తీసుకునేలా ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారు. 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు వీలుగా ఐదు ఎత్తిపోతలు, ఆరు జలాశయాలను నిర్మించారు.