గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (12:38 IST)

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవార్డుల సెలబ్రేషన్‌ - కేసీఆర్ వస్తాడా!

Telugu film industry
Telugu film industry
69వ జాతీయ ఫిలిం అవార్డులు గెలుచుకున్న సందర్భంగా తెలుగు సినిమా రంగం గర్వంగా ఫీలవుతుంది. దాదాపు 11 అవార్డులను వివిద సినిమాలకు వివిధ కేటగిరిలలో గెలుచుకోవడం మామూలు విషయంకాదని సినీ పెద్దలు తెలియజేస్తున్నారు. రాజమౌళి రూపొందించిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. 6 అవార్డులు గెలుపొందగా సుకుమార్‌ చేసిన పుష్ప 2 అవార్డులు దక్కించుకుంది. ఇలా ఉప్పెన తదితర సినిమాలలో సాంకేతిక సిబ్బందికి అవార్డులు రావడం పట్ల చిత్ర దర్శక నిర్మాతలు, హీరోలు ఆనందంగా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 
 
కాగా, ఈ అవార్డు వేడుకలను యావత్తు తెలుగు సినిమా మొత్తం కలిసి చేసుకునేలా ప్లాన్‌ చేయడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. అగ్ర నిర్మాతలు ఈ విషయమై శ్రావణ శుక్రవారంనాడు చర్చించినట్లు తెలిసింది. దీనికి ముఖ్యమంత్రి సైతం హాజరయ్యేలా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వివిధ సినిమాలకు చెందిన యూనిట్‌ వినోదపార్టీలు నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్‌ తన టీమ్‌తోపాటు సన్నిహితులతో కలిసి ఈరోజు ఓ స్టార్‌ హోటల్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే దక్షిణాది చలనచిత్ర రంగంనుంచి పలువురు అల్లు అర్జున్‌కు, రాజమౌళి తదితరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
 
శనివారంనాడు దిల్‌రాజు తన  స్పందన తెలిపారు. , అల్లు అర్జున్‌, ఆర్‌.ఆర్‌.ఆర్‌. టీమ్‌కు పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళికి ప్రత్యేకంగా కితాబిస్తూ, మీ వల్లే తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో గర్వించే సినిమాగా నిలిచింది. ఇలా అందరికీ కంగ్రాట్స్‌ అంటూ మనం అందరం ప్రత్యేకంగా అభినందించుకోవాల్సిన సమయం వచ్చిందంటూ తెలిపారు.