గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (17:17 IST)

జనసేనకు గుడ్ న్యూస్: గాజు గ్లాసుతో పోటీ

janasenaparty flag
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఆ పార్టీకి మరోసారి గ్లాస్ గుర్తునే కేటాయించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ఆ పార్టీ నేతలు వెల్లడించారు. 
 
దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికల గుర్తు "గాజు గ్లాసు" పైనే పోటీ చేయబోతున్నారు. జనసేనకు మరోసారి గ్లాస్ గుర్తును కేటాయించడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
 
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలలో బరిలో నిలిచేందుకు జనసేన అభ్యర్థులు సన్నద్ధమవుతున్న తరుణంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. దీంతో ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన గాజు‌ గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంతకాలం కింద రద్దు చేసిన సంగతి తెలిసిందే.