బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (16:21 IST)

మద్యం తాగి వచ్చాడని మందలించిన తల్లి... నాలుక కోసిన కిరాతక కొడుకు

knife
మద్యం తాగివచ్చాడని మందలించినందుకు తల్లి మందలించింది. దీన్ని జీర్ణించుకోలేని కిరాతక తనయుడు ఆమెపై దాడి చేసి... ఆమె నాలుకను కోశాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా రామభద్రపురంలో చోటుచేసుకుంది. తాగిన మైకంలో తల్లిన దారుణంగా గొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె నాలుక కోసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళగా, ఆ నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. 
 
రామభద్రాపూరానికి చెందిన రవణమ్మకు శ్రీనివాస రావు అనే కుమారుడు ఉండగా, అతను పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం పీకల వరకు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మద్యం తాగి తూలుతూ వచ్చిన కుమారుడిని చూసిన రవణమ్మ తీవ్రంగా మందలించింది. 
 
దీంతో కొద్దిసేపు తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంహంతో శ్రీనివాస తన తల్లిపై దారుణంగా దాడి చేసి హతమార్చాడు. తల్లి కిరాతకంగా హత్య చేసిన ఆమె నాలుకను కోసి దానిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.