బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (21:32 IST)

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించిన రిషి సునక్ తల్లిదండ్రులు

Rishi sunak
Rishi sunak
బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ తల్లిదండ్రులు యశ్వీర్-ఉషా సునక్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. వారితో పాటు సునక్ అత్తమ్మ సుధా మూర్తి కూడా ఉన్నారు. 
 
ఈ సందర్భంగా ఆలయంలో వారు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆపై ఆలయ అర్చకులు వారిని శాలువాలతో సత్కరించారు. 
బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ తల్లిదండ్రులు రాఘవేంద్ర స్వామి సందర్శనకు సంబంధించిన ఫోటోలను సునక్ ఫ్యామిలీతో పాటు సుధామూర్తి ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. 
 
రుషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ఏపీ రాఘవేంద్ర మఠాన్ని సందర్శించుకున్నారు.