రేబిస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి.. కుక్క కరిచిన విషయాన్ని చెప్పకుండా.?
ఘజియాబాద్‌లో 14 ఏళ్ల బాలుడు రేబిస్‌తో మరణించాడు. నెల రోజుల క్రితం బాలుడిని కుక్క కరిచింది. అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు భయపడి చెప్పకుండా దాచేశాడు.
నాలుగు రోజుల తర్వాత రేబిస్ లక్షణాలతో బాధపడటం ప్రారంభించాడు. చీకటిలోనే వుండేవాడని, నీటిని చూస్తే భయపడేవాడని, పెద్ద పెద్ద శబ్దాలు చేసేవాడని అతని తాత మత్లుబ్ అహ్మద్ తెలిపారు.
సబేజ్ పరిసరాల్లో వీధి కుక్కలు పెరిగిపోతున్నాయి. సబేజ్ అనే మృతుడిని ఆ వీధిలోని ఓ కుక్క కరిచింది. ఈ కుక్కలు గతంలోనూ పలువురిపై దాడి చేశాయి.
కానీ సబేజ్ మాత్రం వీధికుక్క కరిచిన విషయాన్ని దాచాడు. దీంతో రాబిస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. రాబిస్ వ్యాధితో ఆ బాలుడు పడిన పాట్లు ఆతని తల్లిదండ్రులు చూస్తూ రోదించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.