ఇల్లు ఊడ్చడం వంటి పనులతో గుండెపోటు ముప్పుకు దూరం
ఇటీవలికాలంలో గుండెపోటులకు గురై ప్రాణాలు విడిచే వారి సంఖ్య ఎక్కువైంది. వయసులతో నిమిత్తం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, రోజూవారీ పనులతోనూ గుండెపోటు ముప్పును తగ్గించుకోవచ్చని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది.
రోజూవారీ జీవితంలో చేసే చిన్న చిన్న పనులతో కూడా గుండెపోటు, ఆకాలమరణాల ముప్పు తగ్గే అవకాశం ఉందని యూకే, ఆస్ట్రేలియా పరిశోధకుల బృందాలు చేసిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. సిడ్నీ యూనివర్సిటీ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన ఫలితాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు.
'పరిశోధనలో భాగంగా యూకేలోని బయోబ్యాంకులో 25 వేల మందికి వారు ధరించిన ఫిట్నెస్ పరికరాల్లో నమోదైన ఎనిమిదేళ్ల ఆరోగ్య సమాచారాన్ని అధ్యయనం చేశాం. ఇంట్లో మెట్లు ఎక్కడం నుంచి ఇల్లు ఊడ్చటం వరకూ.. చిన్న చిన్న రోజూవారీ పనులు సైతం గుండెపోటు వచ్చే ముప్పును గణనీయంగా తగ్గిస్తాయని ఈ సందర్భంగా గుర్తించాం.
ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది. వ్యాయామం ప్రత్యేకంగా చేయడం కుదరని పెద్దవారికి రోజూవారీ పనులు ఎలా ఉపకరిస్తాయన్నది మా అధ్యయనంలో స్పష్ట మైంది' అని పరిశోధకులు తెలిపారు..