సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2023 (12:09 IST)

సమంతకు స్పెషల్ గిఫ్ట్ పంపిన నయనతార!

Nayanatara_Samantha
Nayanatara_Samantha
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, స్టార్ హీరోయిన్ సమంత మంచి స్నేహితులు. తాజాగా నయనతార సమంతకు ఓ స్పెషల్ గిఫ్ట్ పంపింది. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 
ఈ హాట్ భామలు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో పాటు నార్త్ సినీ ఇండస్ట్రీలోనూ రాణిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సామ్ క్రేజ్ తెచ్చుకుంటే, జవాన్‌తో నయనతార సాలిడ్ హిట్ కొట్టింది. 
 
ఈ మధ్య కాలంలో హీరోయిన్లు సినిమాలకే పరిమితం కాకుండా అనేక వ్యాపారాలు చేస్తూ సినిమాలు చేస్తున్నారు. నయనతార కూడా సొంతంగా వ్యాపారం చేస్తోంది. నయన్ ఇటీవల తన కొత్త వెంచర్ 9 స్కిన్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన కాస్మోటిక్స్‌ను భారత్‌తో పాటు మలేషియా, సింగపూర్‌లలో విక్రయిస్తున్నారు.
 
కొత్త కంపెనీ కావడంతో వాటిని బాగా ప్రమోట్ చేస్తోంది నయన్. ఇందులో భాగంగా, నయనతార తన స్నేహితురాలికి 9 స్కిన్ నుండి బేస్ క్రీమ్ కాస్మెటిక్స్ బహుమతిని పంపి ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది. 
 
ఇదిలా ఉంటే, కాత్తువాక్కుల రెండు కాదల్ సినిమాతో నయనతార, సమంత ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రానికి నయన్ భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు.