గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (12:07 IST)

"పద్మావత్" డైరక్టర్‌తో నయనతార సినిమా?

Nayanatara
స్టార్ హీరోయిన్ నయనతార ఈ ఏడాది బాలీవుడ్‌లో సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ సరసన "జవాన్"లో నటించడం ద్వారా బిటౌన్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇతర దేశాల్లోనూ సరికొత్త రికార్డులు సృష్టించింది. 
 
దక్షిణాది సూపర్ స్టార్ అయిన నయనతార మళ్లీ బాలీవుడ్‌లో భారీ సినిమాలో నటించనుందని టాక్ వస్తోంది. షారూఖ్ ఖాన్‌తో నటించిన తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి.  
 
"పద్మావత్" వంటి పురాణ కాలపు చిత్రాలను తెరకెక్కించిన పాపులర్ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తన తదుపరి ఇతిహాసం "బైజు బావ్రా"లో నయనతారకు కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు సమాచారం. 
 
ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అలియా భట్ ప్రధాన నటులు. నయనతార ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటే ప్రాజెక్ట్‌కి మరింత హైప్ తోడవుతుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. మరి ఈ సినిమాకు నయనతార ఒప్పుకుందో లేదో తెలుసుకోవాలంటే.. మరికొద్దికాలం వేచి చూడాల్సిందే.