గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2023 (12:51 IST)

'అరుంధతి' తరహాలో లక్ష్మీప్రసన్న "ఆదిపర్వం"

aadi parvam
మంచు లక్ష్మి ముఖ్యపాత్ర పోషిస్తున్న చిత్రం. ''ఆదిపర్వం''. 1974-1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. "అమ్మోరు - అరుంధతి" చిత్రాల తరహా ఈవిల్ పవర్ అండ్ డివోషనల్ పవర్ మధ్య జరిగే పవర్ ఫుల్ మూవీ ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పాలి. 
 
ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ "ఆదిపర్వం". గ్రాఫిక్స్ ప్రధానమైన చిత్రంగా మలిచారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అలాగే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగానే కాకుండా ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి పవర్ ఫుల్ రోల్  పోషిస్తుంది. మంచు లక్ష్మి పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
aadi parvam
 
ఈ చిత్రంలో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠంనేని, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్, యోగి కాత్రి, మధు నంబియార్, బృంద, స్నేహ అజిత్, అయేషా, జ్యోతి, శ్రావణి, గూఢా రామకృష్ణ, రాధాకృష్ణ తేలు, డీఎస్పీ మొదలగువారు ప్రధాన పాత్రలు పోషించారు.