మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (12:04 IST)

మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్.. శ్రీలీల

srileela
తెలుగు చిత్రపరిశ్రమలో హాటెస్ట్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల ఇపుడు వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు. పైగా, ఆమె నటించిన చిత్రాలు కూడా వరుసగా విజయాలు సాధిస్తున్నాయి. చిత్రపరిశ్రమలోని ప్రముఖులందరితో సన్నిహితంగా మెలుగుతుండటంతో ఈమెకు వరుస ఛాన్సులు వస్తున్నాయి. దీంతో తమిళ పరిశ్రమలో అవకాశాలు వచ్చినా వాటికి కమిట్ కాలేకపోతున్నారు. తాజాగా ఆమె నటించిన "స్కంద" చిత్రం విడుదలవుతుంది. రామ్ పోతినేని హీరో. ఇందులో తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా ఉందని చెప్పారు. 
 
అయితే, తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో ఎదగడం కష్టం అనే అభిప్రాయాన్ని శ్రీలీల తొలగించారు. తొలి సినిమా ఓ మోస్తరుగా ఆడినప్పటికీ శ్రీలీల నటన, ప్రతిభకు మాత్రం ఫుల్ మార్కులు పడ్డాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది.
 
పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్', మహేశ్ బాబుతో 'గుంటూరు కారం' చిత్రాల్లోనూ శ్రీలీలే హీరోయిన్. నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి' చిత్రంలో ఈ స్లిమ్ బ్యూటీ ఓ కీలక పాత్రలో కనువిందు చేయనుంది. నితిన్ సరసన 'ఎక్స్‌టార్డినరీ మ్యాన్'లో, వైష్ణవ్ తేజ్ సరసన 'ఆదికేశవ' చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.