శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (14:24 IST)

తమన్నాకు తమిళ అబ్బాయి నచ్చలేదా?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా చిత్రపరిశ్రమలో ఉన్న ముదురు హీరోయిన్లలో ఒకరు. వయసు మూడు పదులు దాటిపోయింది. అయినప్పటికీ పెళ్ళి ఊసెత్తడం లేదు. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెతో మీడియా ముచ్చటించింది. 
 
నెగెటివిటీని మీరు ఎలా ఎదుర్కొంటారు అని ఓ అభిమాని ప్రశ్నించగా, వ్యతిరేకత, విమర్శలు వచ్చినపుడు ఎందుకిలా జరుగుతుంది అని ఆలోచన చేస్తాం. కొంతమంది ప్రశంసిస్తారు. మరికొందరు విమర్శిస్తారు. అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దానికి చింతించాల్సిన అవసరం లేదు. వ్యతిరేకతను నేను అస్సలు పట్టించుకోను అని చెప్పారు. 
 
అదేవిధంగా మరో అభిమాని ప్రశ్నిస్తూ, మీరు పెళ్ళి ఎపుడు చేసుకుంటారు. తమిళబ్బాయిలు మీకు నచ్చలేదా అని ప్రశ్నించారు. దీనికి తమన్నా ఒకింత అసహనానికి గురయ్యారు. "నా తల్లిదండ్రులే ఇలా నన్నెపుడూ అడగలేదు'' అని సమాధానమిచ్చారు. తన ప్రియుడు విజయ్‌ వర్మను ఉద్దేశిస్తూ.. 'ప్రస్తుతం జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను. నా లైఫ్‌ ఎంతో ఆనందంగా సాగుతుంది' అని చెప్పారు.