గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (13:05 IST)

అత్యుత్సాహంమే భోళాశంకర్‌ ప్లాప్‌కు కారణమా?

chiru- Rajani
chiru- Rajani
సాధారణంగా తెలుగులో అగ్రహీరోల సినిమాలు ఎప్పుడు రిలీజైనా వేరే సినిమాలు ఆ రోజు విడుదల కాకుండా జాగ్రత్త పడుతుంటారు. అందుకు సంబంధించిన ఇతర సినిమాల దర్శక నిర్మాతలు ఆలోచిస్తారు. కొందరు వెనుకడుగువేస్తారు. మరికొందరు సాహసంతో ముందడుగు వేసి చిన్న సినిమాలు రిలీజ్‌ చేస్తారు. అలాంటిదే ఈసారి భోళాశంకర్‌ టైంలో స్లమ్‌ డాగ్‌ హస్బండ్‌ సినిమా విడుదలచేశారు దర్శక నిర్మాతలు. ఎందుకంటే చిరంజీవి సినిమా పుల్‌ అయితే మిగిలిన వారు మా సినిమాకు వస్తారని వారు లెక్కలు వేశారు. కానీ అది రివర్స్‌ అయింది.
 
ఎందుకంటే అదేటైంలో జైలర్‌ సినిమా విడుదలకావడం. దానికి పెద్దగా తెలుగులో పబ్లిసిటీకూడా లేకపోవడంతో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. పైగా రజనీకాంత్‌ సినిమాలంటే పెద్దగా ఈమధ్య హిట్‌లు లేవు. అందుకే చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఈవిషయంలో భోళాశంకర్‌ దర్శక నిర్మాతలు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు. పైకి మాత్రం మా సినిమాతోపాటు రజనీ సినిమా కూడా ఆడాలని తెలియజేశారు. కానీ సీన్‌ రివర్స్‌ అయింది.
 
అసలు భోళాశంకర్‌ కథను చాలా మార్పులుచేసేసి తీయడం ప్రధాన లోపంగా వినిపిస్తోంది. వేదాళంలో హీరో సిస్టర్‌ పాత్ర పేరెంట్స్‌ అంథులు, వారున్న ఇల్లు ఖాళీ చేయించాలి. అది గతంలో లారెన్స్‌ సినిమాలో వుండడంతో భోళాశంకర్‌లో మురళీశర్మ, తులసిని పెట్టి తీశారు. పైగా మెగాస్టార్‌కు జబర్‌దస్త్‌ బ్యాచ్‌ చాలా మైనస్‌ అయిందనే టాక్‌ ప్రధానంగా వినిపిస్తోంది. చిల్లర చిల్లరగా వారి వేషాలు వుండడం సినిమా స్థాయిని దిగజార్చింది. ఇవి కాకుండా కథనంలో చాలా లోపాలు కనిపించాయి. పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఖుషి ఎపిసోడ్‌ చిరంజీవి చేయడం చాలా మైనస్‌ అని తెలుస్తోంది.
 
ఏది ఏమైనా చిరంజీవి సినిమా సూపర్‌హిట్‌ చేయాలని జైలర్‌ సినిమా విదుదల థియేటర్లను కొన్నింటిని తగ్గించి భోళాశంకర్‌ ప్రదర్శించారు. కానీ మార్నింగ్‌ షో కాకగానే నెగెటివ్‌ టాక్‌ రావడంతో తిరిగి జైలర్‌ వేయాల్సివచ్చింది. ఈ విషయంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ మాట్లాడుతూ, జైలర్‌ను చాలా తక్కువగా అంచనావేశారు. ఇప్పటికే తెలుగు లో 65 కోట్ల గ్రాస్‌ చేసింది జైలర్‌. ఏదైనా సింగం సైలెంట్ గా వస్తుందని రజనీకాంత్‌ డైలాగ్‌ ఆయనే చెల్లుతుందంటూ సెటైర్‌గా మాట్లాడారు.