గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (09:19 IST)

అల్లు అర్జున్‌ ప్రతిభను ఎప్పుడో గుర్తించిన చిరంజీవి ` పోటీవున్నా ఐకాన్‌గా మారాడు (స్పెషల్‌ స్టోరీ)

Allu Ramalingaiah (rare photo)
Allu Ramalingaiah (rare photo)
అల్లు అర్జున్‌ను ఉత్తమ నటుడిగా పుష్ప` ది రైజ్‌ సినిమాకు రావడం పట్ల తెలుగు చలనచిత్రరంగం ఎంత ఆనందంగా వుందో దేశమంతా ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. నిన్న ఈ వార్త వినగానే అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ ఇంట సందడి నెలకొంది. వేలాదిమంది ఫోన్లతోపాటు ప్రముఖులు వారి ఇంటికి వచ్చి ప్రత్యేకంగా అభినందనలు  తెలిపారు. పుష్ప చిత్ర దర్శక నిర్మాతలు మరింత గర్వంగా ఫీలయి ఆనందాన్ని వ్యక్తం చేశారు. తగ్గేదెలే అన్నట్లుగా వారి పరిస్థితి వుంది. తగ్గేదెలే అనే పదం న్యూయార్క్ మేయర్ కూడా పాకింది. రాజకీయాలు, స్పోర్ట్స్  ప్రముఖులు కూడా ఈ పదాన్ని వాడారంటే దాని పవర్ ఏమిటో అర్ధమైంది. 
 
with newyork mayar
with newyork mayar
అదీబన్నీలో ప్రత్యేకత.
అల్లు అర్జున్‌ కెరీర్‌పరంగా చూసుకుంటే ఆయన్ను బాగా గమనించి, గుర్తించి అభివృద్ధిలోకి వస్తాడని ముందుగా ఆశీస్సులు అందించి మెగాస్టార్‌ చిరంజీవిగారే. ఎదుటివాడిలో టాలెంట్‌ ఏముందు కనిపెట్టే గుణం వున్న చిరంజీవి చిన్నతనంలోనే అల్లు అర్జున్‌ (బన్నీ) తనను ఫాలో అవుతూ డాన్స్‌ వేయడం నుంచి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని ఉదయం 4.30గంటలకు లేచి ప్రాక్టీస్‌ చేసేవాడని ఓ సందర్భంగా తెలియజేశాడు. రాత్రిళ్ళు కూడా ఏదైనా సమయం దొరికితే బన్నీ డాన్స్‌లు మామూలుగా వుండేవికావు. తన మామయ్య స్పూర్తితోపాటు ఆయన జీవితంలో మరో వ్యక్తి వున్నాడు. ప్రపంచ డాన్సర్‌ మైఖైల్‌ జాక్సన్‌ను అనుకరిస్తూవున్నా తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నాడు. అదీబన్నీలో ప్రత్యేకత.
 
నటప్రస్తావనం
నటుడిగా బన్నీ బాలనటుడిగా కెరీర్‌ను చిరంజీవి విజేత సినిమాలో ఆరంభించారు. ఇక కమల్‌హాసన్‌ స్వాతిముత్యంలో ఆయన కనీపించి కనిపించని చిన్న పాత్రను చేశాడు. చెన్నైలో 82లో పుట్టిన బన్నీ చిన్నతనంలోనే తన తాత అల్లురామలింగయ్య, తండ్రి అరవింద్‌ల ప్రోత్సాహం ఎంతో వుంది. తన తాతతో కలిసి హాస్యాన్ని ఎలా చేయాలో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. తాతతో చనువు ఎక్కువ కావడంతో తాతను అనుసరిస్తూ వుండేవాడు. ఆ సందర్భంగా అరవింద్‌ కూడా కొడుక్కు చలనచిత్రరంగం ఎలా వుంటుందో అనికూడా వివరించేవారు. చిరంజీవి కుటుంబంలో జరిగే ఫంక్షన్‌లకు పలువురు ప్రముఖులు వచ్చేవారు. ఆ సందర్భంలో దర్శకుడు కె. రాఘవేంద్రరావుగారు రావడం బన్నీ డాన్స్‌ చూసి ముందుగా వారి తల్లికి 100 రూపాయలు అడ్వాన్స్‌గా ఇవ్వడం జరిగింది. దాన్ని అపురూపంగా ఇప్పటికీ పెట్టుకున్నానని బన్నీ చెబుతుంటారు.
 
ముఖంలో ఏదో కళ వుందని 
అయితే బన్నీని గంగోత్రి సినిమా చేసేటప్పుడు ఆయన ముఖకవళికలు పెద్దగా అందరికీ నచ్చేవికావు. పేడిమూతలా వుంటూ రకరకాలుగా వున్నా ఆయన ముఖంలో ఏదో కళ వుందని రాఘవేంద్రరావు కనిపెట్టి ఆయనచేత ఆ పాత్ర వేయించారు. అయితే ఇక్కడో ముఖ్య విశేషం వుంది. బన్నీచేత ఆడవేషం వేయించి అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు రాఘవేంద్రరావు. సునీల్‌తో ప్రేమాయణం వంటి సన్నివేశాలు ఎంటర్‌టైన్‌ చేశాయి. ఇది చూసిన తాత అల్లురామలింగయ్య అప్పుడే పెద్ద నటుడు అవుతాడని ఆశీర్వదించారు కూడా. ఆ తర్వాత ప్రజల్లో వస్తున్న నెగెటివ్‌ను ఛేదించడానికి బన్నీని ఆహార్యపరంగా సరైన రూపం తీసుకురావడానికి అల్లు అరవింద్‌ కృతకృత్యుడయ్యాడు.

ఆర్య సినిమాతో కమర్షియల్‌ 
ఇక ఆ తర్వాత బన్నీలో కొత్త కోణం కనిపించింది. ప్రేక్షకులు, అభిమానులు ఆయన్ను రిసీవ్‌ చేసుకోవడం మొదలైంది. అలా ఒక్కో సినిమాకూ ఒక్కో తరహాలో నటిస్తూ ఆర్య సినిమాతో కమర్షియల్‌ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. బన్నీ, పరుగు, వేదం, దేశముదురు, సన్నాఫ్‌ సత్యమూర్తి, డి.జె., అలవైకుంఠపురంలో వంటి సినిమాల్లో అలరించాడు. అలవైకుంఠపురంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వకముందే అల్లు అరవింద్‌గారు ఇందులోని పాటలు ఓ పదేళ్ళపాటు రాజ్యమేలతాయని కితాబిచ్చాడు. అలాగే ఇందులోని పాటలు హైలైట్‌ అయ్యాయి. ఇక పుష్ప సినిమాతో తనలోని నట విశ్వరూపం చూపించాడు బన్నీ.
 
తనలా చేయగలవాడు బన్నీనే అన్న చిరంజీవి
బన్నీకి డాన్స్‌ అంటే ప్రీతి. తన మామయ్యను ఫాలో అయ్యాడు. చిరంజీవికి పిల్లంటే ఇష్టం. అందరికీ ఏ మాత్రం విరామం దొరికినా వారిని పోగుచేసుకుని పిల్లలతో డాన్స్‌లేస్తూ వారిని ఎంకరేజ్‌ చేశాడు. అలా డాన్స్‌ విషయంలో మెలకువులవు నేర్చుకున్నాడు బన్నీ.
ఇక చంటాబ్బాయ్‌ సినిమా సక్సెస్‌ అయిన తర్వాత అందులోని పాత్రను ఈ తరంలోని ఎవరు చేయగలరనే ఓ విలేకరి అడిగినప్పుడు క్షణం ఆలోచించకుండా అల్లు అర్జున్‌లాంటివాడు మాత్రమే చేయగలడు అనే స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అప్పటికి రామ్‌చరణ్‌ ఇంకా నటనాపరంగా ఇంకా డెవపల్‌ కాలేదు. అందులో అప్పట్లో చిరంజీవి నటవారసుడు బన్నీ అంటూ వార్తలు కూడా రాశారు. 
 
హాస్యాన్ని ప్రదర్శించి 
ఇక తాత అల్లురామలింగయ్య నుంచి హాస్యాన్ని ఎలా పేల్చాలో నేర్చుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని తాతగారికి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆయనచేత కొన్ని పాత్రల గురించి పస్త్రావించి మెళకువలు నేర్చుకునేవాడని అప్పట్లో రామలింగయ్యగారు ఓ సందర్భంలో చెప్పారు. అలాంటి బన్నీ ఒకవైపు సీరియస్‌, డాన్స్‌తోపాటు మాస్‌, మరోవైపు హాస్యాన్ని ప్రదర్శించి ఓ స్థాయికి వెలతాడని చిరంజీవి చెప్పింది నిజమైంది. 
 
అందుకే పుష్పతో తన పెర్‌ఫారెమన్స్‌లోని విశ్వరూపం చూపించాడు. బన్నీ పాత్రలో లీనమై పోయిన విధానాన్ని చూశాక దర్శకుడు సుకుమార్‌ బన్నీకి ఐకాన్‌ స్టార్‌ బిరుదు ఇచ్చాడు. అది చాలా పాపులర్‌ అయింది. ఆ సినిమా తర్వాత నిజంగానే ఆయనకు పోటీ హీరోలున్నా ఒక ఐకాన్‌గా మారాడు. తన ఏజ్‌ హీరోలు మార్కెట్‌లో ఉన్నప్పటికీ తనకూంటూ ఐకాన్‌గా. అల్లు రామలింగయ్య మనువుడిగా, అరవింద్‌ కొడుకుగా ప్రపంచస్థాయిలో గర్వించతగ్గ నటుడిగా పేరుతెచ్చుకున్నారు.