బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2023 (19:51 IST)

పెళ్లి గురించి తమన్నా ఏం చెప్పిందో తెలుసా?

tamannah
పెళ్లి గురించి సినీనటి తమన్నా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకం ఉందని తెలిపింది. పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్ల క్రితం అనుకున్నానని... అయితే, కెరీర్ బిజీగా మారడంతో పెళ్లి ఆలోచనకు ముగింపు పలికానని చెప్పింది. 
 
ప్రస్తుతం ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని.. సో పెళ్లి ఇప్పుడే చేసుకోనని తమన్నా వెల్లడించింది. 18 ఏళ్ల పాటు సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తమన్నా... వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో చాలా బిజీగా వున్న సంగతి తెలిసిందే. 
 
మరోవైపు సినీ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమలో ఉంది. ఇటీవలే వీరిద్దరూ మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లొచ్చారు.