శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (09:12 IST)

పెళ్లి పేరుతో మోసం.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అత్యాచారం.. భోజ్‌పురి నటి

Priyansu Singh
Priyansu Singh
మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. పురుషులకు సమానంగా అన్నీ రంగాల్లో రాణిస్తున్నా.. మహిళలపై మోసాలు ఆగట్లేదు. తాజాగా భోజ్‌పురి నటి ప్రియాంశు సింగ్ సహ నటుడు పునీత్‌సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ప్రియాంశు ఫిర్యాదులో పేర్కొంది. 
 
సోషల్ మీడియా ద్వారా అతడు పరిచయం అయ్యాడని.. అతనికి సినీ అరంగేట్రం కోసం సాయం చేశానని.. అవకాశాలు కల్పించానని వెల్లడించింది. మొదట్లో మర్యాదగా ప్రవర్తించేవాడని.. ఆ గౌరవానికి ఫిదా అయ్యి అతనిని ప్రేమించానని.. ఆపై తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.
 
ఓసారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం తాగొచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ తర్వాత మరోమారు  కూడా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. 
 
చివరికి పెళ్లి పేరుతో మోసం చేశాడని తెలిపింది. బాధిత నటి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వీరిద్దరూ కలిసి పలు భోజ్‌పురి మ్యూజిక్ వీడియోల్లో నటించారు.