గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (10:40 IST)

రూ.400 కోట్ల క్లబ్‌లోకి 'జైలర్' - హిమాలయాల్లో రజనీకాంత్

jailer
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన "జైలర్" చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ నెల 10వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. విడుదలైన ఐదు రోజుల్లో రూ.357.60 కోట్ల గ్రాస్ మేరకు కలెక్షన్లు రాబట్టింది. మంగళవారంతో ఈ చిత్రం రూ.400 కోట్లు రాబట్టి ఉంటుందనే అంచనా వేశారు. ఈ వారాంతంలోను కలెక్షన్ల వర్షం కొనసాగుతుందని భావిస్తున్నారు. 
 
రమ్యకృష్ణ, తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీష్రాఫ్, సునీల్, యోగిబాబు తదితరులు ముఖ్యమైన పాత్రలను పోషించారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించిన ఈ సినిమా, తొలిరోజునే రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసింది. 
 
ఈ సినిమా ఈ నెల 14వ తేదీతో 5 రోజులను పూర్తి చేసుకుంది. ఈ ఐదు రోజులలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.357.60 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక ఇన్ని ఆగస్టు 15 సందర్భంగా థియేటర్ల దగ్గర ఒక రేంజ్‌లో సందడి కనిపించింది. భారీ స్థాయిలో బుకింగ్స్ జరిగినట్టుగా తెలుస్తుంది.