శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (15:59 IST)

10 నుంచి జైలర్ సందడి... చెన్నై - బెంగుళూరు కార్యాలయాలకు సెలవు

Jailer
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. ఈ నల 10వ తేదీన విడుదలకానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. రమ్యకృష్ణన్, తమన్నాలు హీరోయిన్లుగా నటించారు. అయితే, రజనీకాంత్ చిత్రం విడుదలవుతుందంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు పెద్ద పండుగ వంటిది. అలాగే, పలు కంపెనీలు కూడా సెలవులు ప్రకటిస్తున్నాయి. 
 
తాజాగా యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ ఈ నెల 10వ తేదీన సెలవు ప్రకటించింది. అంతేకాదండోయ్.. అందులో పని చేసే ఉద్యోగులందరికీ ఉచితంగా టిక్కెట్లను పంపిణీ చేస్తుంది. చెన్నై, బెంగుళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మాట్టుదావని, ఆరపాళెయం, అలగప్పన్ నగర్‌లలో ఉన్న తమ శాఖ కార్యాలయాలకు సెలవు ప్రకటించబోతున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. 
 
అయితే, ఈ నెల 11వ తేదీన మెగాస్టార్ చిరంజీవి చిత్రం భోళా శంకర్ విడుదలవుతుంది. ఇద్దరు సూపర్ స్టార్ల చిత్రాలు ఒక రోజు వ్యవధిలో రిలీజ్ కానుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, చిరంజీవికి కోలీవుడ్‌లో మార్కెట్ నామమాత్రంగా ఉండగా, రజనీకాంత్‌కు మాత్రం టాలీవుడ్ మంచి మార్కెట్ ఉన్న విషయం తెల్సిందే.