1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ : అసదుద్దీన్ జోస్యం

asaduddin
తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ మహా నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయనున్నారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేంద్రం కసరత్తులు చేస్తుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు బెంగుళూరు, చెన్నై, ముంబై నగరాలు కూడా యూటీలుగా మారే రోజులు ఎంతో దూరంలో లేవని ఆయన జోస్యం చెప్పారు. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలను తాను ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపారు. 
 
ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామంతోపాటు ఇతర అధికారాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీనిపై గురువారం లోక్‌సభలో చర్చ జరిగింది. ఇందులో అసదుద్దీన్ పాల్గొని ప్రసంగిస్తూ, ఢిల్లీ ఆర్డినెన్స్‌ను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. బీజేపీ, ఆప్ పార్టీలు తమ రాజకీయ పోరాటాన్ని, ఆధిపత్యాని సభ బయట చూపించుకోవాలని ఆయన కోరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్ర ప్రభుత్వ మనిషేనన్నారు. కేంద్రం ప్రభుత్వంలోని పెద్దల ఆలోచనల నుంచే ఆయన బయటకు వచ్చారని తెలిపారు.